IPL 2023: తన స్వంత రెస్టారెంట్‌కు ఆర్సీబీ ఆటగాళ్లను తీసుకెళ్లిన కోహ్లీ, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ స్వంతంగా దేశంలోని పలు నగరాల్లో వన్8 పేరుతో రెస్టారెంట్లను ఓపెన్ చేసిన సంగతి విదితమే.ఐపీఎల్ (IPL 2023)లో భాగంగా గురువారం సాయంత్రం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది (KKR vs RCB).ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఆటగాళ్లు అందరూ ప్రస్తుతం కోల్‌కతాలో (Kolkata) ఉన్నారు. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ఉన్న తన రెస్టారెంట్ బ్రాంచ్‌కు ఆర్సీబీ ఆటగాళ్లైన గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell), డుప్లెసిస్ (Faf du Plessis), మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)లను కోహ్లీ తీసుకెళ్లాడు. అక్కడ నలుగురూ డిన్నర్ చేశారు. ఆ రెస్టారెంట్‌లో నలుగురూ కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోల్‌కతాలోని గోల్డెన్ పార్క్ పరిసరాల్లో కోహ్లీ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)