Jasprit Bumrah: వైరల్ వీడియో.. బుమ్రా యార్కర్ దెబ్బకు విలవిలలాడిన రోహిత్ శర్మ, బంతి గజ్జల్లో బలంగా తగలడంతో కూలబడిన టీమిండియా కెప్టెన్

బౌన్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తించే భారత స్టార్‌ పేసర్‌ బుమ్రా.. ఎదురుగా ఉన్నది మనోళ్లే కదా అని ఏమాత్రం తగ్గలేదు. భారత కెప్టెన్ రోహిత్‌ శర్మకు తన బౌలింగ్‌ పదును చూపెట్టాడు. ఈ క్రమంలో ఏడో ఓవర్లో బుమ్రా వేసిన ఓ పదునైన బంతి రోహిత్‌కు గజ్జల్లో బలంగా తగిలింది. నొప్పికి తట్టుకోలేక భారత కెప్టెన్‌ కాసేపు మోకాళ్లపై కూర్చుండిపోయాడు

Jasprit Bumrah's fiery delivery hits Rohit Sharma during practice match (Photo-Video Grab)

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం లీసెస్టర్షైర్ కౌంటీ జట్టుతో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు లీసెస్టర్ కౌంటీ బౌలర్లతో పాటు బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. తన యార్కర్లు, బౌన్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తించే భారత స్టార్‌ పేసర్‌ బుమ్రా.. ఎదురుగా ఉన్నది మనోళ్లే కదా అని ఏమాత్రం తగ్గలేదు. భారత కెప్టెన్ రోహిత్‌ శర్మకు తన బౌలింగ్‌ పదును చూపెట్టాడు. ఈ క్రమంలో ఏడో ఓవర్లో బుమ్రా వేసిన ఓ పదునైన బంతి రోహిత్‌కు గజ్జల్లో బలంగా తగిలింది. నొప్పికి తట్టుకోలేక భారత కెప్టెన్‌ కాసేపు మోకాళ్లపై కూర్చుండిపోయాడు. దాంతో, అంతా కంగారు పడ్డారు. జట్టు ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఆ తర్వాత రోహిత్‌ బ్యాటింగ్‌ కొనసాగించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement