New Zealand Squad for World Cup: విధ్వంసకర ఓపెనర్‌పై వేటు, కేన్‌ మామ సారథ్యంలో ప్రపంచకప్‌కు రెడీ అయిన 15 మంది న్యూజీలాండ్ ఆటగాళ్లు వీళ్లే..

కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలో జట్టు ప్రపంచ కప్ ఆడనుంది. గాయం కారణంగా దాదాపు ఆరు నెలలగా జట్టుకు దూరంగా ఉంటున్న విలియమ్సన్‌.. ఇప్పడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు

Williamson steps down

భారత్‌‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్రకటించింది. కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలో జట్టు ప్రపంచ కప్ ఆడనుంది. గాయం కారణంగా దాదాపు ఆరు నెలలగా జట్టుకు దూరంగా ఉంటున్న విలియమ్సన్‌.. ఇప్పడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. దీంతో ఈ మెగా ఈవెంట్‌ జట్టులో చోటు దక్కింది. యువ ఆల్‌రౌండర్లు రచిన్‌ రవీంద్ర, మార్క్‌ చాప్‌మన్‌కూ ఈ జట్టులో చోటు దక్కింది.ఇక విధ్వంసకర ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఇక గాయం కారణంగా స్టార్‌ పేసర్‌ ఆడమ్‌ మిల్నే టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్‌ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్

Here's Team

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)