Mumbai Indians: విదేశాల్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్లుగా కీరన్‌ పొలార్డ్‌,రషీద్‌ ఖాన్‌, కీలక నిర్ణయం తీసుకున్న ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌

విదేశీ టీ20 లీగ్‌లలో తమ జట్లకు వీరిద్దరిని కెప్టెన్లుగా నియమించింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటన విడుదల చేసింది

Rashid Khan (Photo Credits: IANS)

వెస్టిండీస్‌ దిగ్గజం కీరన్‌ పొలార్డ్‌, అఫ్గనిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌కు ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం రిలయన్స్‌ కీలక బాధ్యతలు అప్పగించింది. విదేశీ టీ20 లీగ్‌లలో తమ జట్లకు వీరిద్దరిని కెప్టెన్లుగా నియమించింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటన విడుదల చేసింది.యూఏఈ ఐఎల్‌టీ20 లీగ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌కు కీరన్‌ పొలార్డ్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు రషీద్‌ ఖాన్‌ సారథ్యం వహిస్తారని తెలిపింది.ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ శర్మ నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ముంబై ఫ్రాంఛైజీల కెప్టెన్ల జాబితాలో పొలార్డ్‌, రషీద్‌ కూడా చేరడం విశేషం.

Here's MI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)