KL Rahul Catch Video: కేఎల్‌ రాహుల్‌ అదిరిపోయే క్యాచ్‌ వీడియో, కుడివైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేతితో బంతిని అందుకున్న టీమిండియా వికెట్‌ కీపర్‌

బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ అదిరిపోయే క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 47 ఓవర్‌ వేసిన ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో మహ్మదుల్లా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ దిశగా వెళ్లింది.

Kl Rahul Catch Video (Photo-Video Grab)

బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ అదిరిపోయే క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 47 ఓవర్‌ వేసిన ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో మహ్మదుల్లా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో రాహుల్‌ కుడివైపు డైవ్‌ చేస్తూ ఒంటి చేతితో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. రాహుల్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్‌ మ్యాన్‌ అంటూ రాహుల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఈజీ క్యాచ్‌ను జారవిడిచి మ్యాచ్‌ ఓటమికి కారణమైన రాహుల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now