LSG vs DC: డేవిడ్ వార్నర్ మెరుపులు వృథా, 5 వికెట్లతో ఢిల్లీ బ్యాటర్ల భరతం పట్టిన మార్క్‌‌వుడ్‌, 50 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బోణీ చేసింది. డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 50 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.

Mark Wood

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బోణీ చేసింది. డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 50 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ 56 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రిలీ రొసౌ 30 పరుగులు చేశాడు. అక్షర్‌ పటేల్‌ 16 పరుగులు చేసి ఔటయ్యాడు. లక్నో బౌలర్లలో మార్క్‌ వుడ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. ఆవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.

ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ, డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్‌పై గెలుపు, రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ కైల్‌ మేయర్స్‌ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ 38 బంతుల్లోనే 73 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. నికోలస్‌ పూరన్‌ 36 పరుగులతో రాణించాడు. చివర్లో ఆయుష్‌ బదోని ఏడు బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ సాయంతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, చేతన్‌ సకారియాలు చెరో రెండు వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now