Mohammed Shami: రికార్డుల ఊచకోత కోసిన మొహమ్మద్ షమీ, ఏకంగా నాలుగు రికార్డులకు పాతర, బంగ్లాతో 5 వికెట్లతో దుమ్మురేపిన భారత స్పీడ్ స్టర్

భారత ఏస్ పేసర్ మహ్మద్ షమి బంగ్లా వెన్నువిరిచాడు. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో 5 వికెట్లతో ప్రభంజనం సృష్టించాడు. ఈ క్రమంలో 4 పాత రికార్డులను చరిత్ర పుటల్లోకి పంపాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

Mohammed Shami (Photo-X)

భారత ఏస్ పేసర్ మహ్మద్ షమి బంగ్లా వెన్నువిరిచాడు. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో 5 వికెట్లతో ప్రభంజనం సృష్టించాడు. ఈ క్రమంలో 4 పాత రికార్డులను చరిత్ర పుటల్లోకి పంపాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే ఐసీసీ ఈవెంట్స్‌లో అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన టీమిండియా బౌలర్‌గా నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఫైఫర్ సాధించిన తొలి భారత బౌలర్‌గానూ అతడు రికార్డ్ క్రియేట్ చేశాడు.

వీడియో ఇదిగో, బంగ్లా ఓపెనర్ సౌమ్యను డకౌట్‌గా పెవిలియన్‌కి సాగనంపిన మహమ్మద్ షమీ,అధ్భుతమైన డెలివరీకి బోల్తా పడిన బంగ్లా బ్యాటర్

ఐసీసీ ఈవెంట్స్‌లో మెన్ ఇన్ బ్లూ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గానూ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత చేజింగ్ స్టార్ట్ చేసిన రోహిత్ సేన ప్రస్తుతం 31 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

Mohammed Shami Becomes Highest Wicket-Taker for India in ICC ODI Events

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement