Mohammed Siraj Direct Hit Video: సిరాజ్‌ బుల్లెట్ త్రో వీడియో ఇదిగో, డైరక్ట్ హిట్ దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్‌ రీజా హెండ్రిక్స్‌ ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి మరి

భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సంచలన త్రోతో మెరిశాడు. సిరాజ్‌ తన మెరుపు త్రో సౌతాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.

Mohammed Siraj Throw (photo-X)

జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో 106 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ సమమైంది. తొలి వర్షం కారణం‍గా రద్దు కాగా.. రెండో టీ20 దక్షిణాఫ్రికా, మూడో టీ20లో భారత్‌ గెలుపొందాయి. కాగా ఈ మ్యాచ్‌లో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సంచలన త్రోతో మెరిశాడు. సిరాజ్‌ తన మెరుపు త్రో సౌతాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.

ప్రోటీస్‌ ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో రెండో బంతిని హెండ్రిక్స్ మిడ్-ఆన్‌ దిశగా షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో సింగిల్‌ కోసం హెండ్రిక్స్ నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌ పరిగెత్తాడు. అయితే మిడ్-ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సిరాజ్‌ వెంటనే బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌ వైపు డైరక్ట్‌ త్రో చేశాడు.హెండ్రిక్స్ క్రీజుకు చేరిటప్పటికే బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now