IPL 2022 Auction: ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇషాన్‌ కిషన్‌, రూ. 15.25 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్‌

ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపాడు. అత్యధికంగా 15. 25 కోట్ల రూపాయలు పలికాడు. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై ఇండియన్స్‌ వేలంలో పోటీ పడి మరీ దక్కించుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢీకొట్టి ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది.

Wicketkeeper-batsman Ishan Kishan (Photo/ ICC Twitter)

ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపాడు. అత్యధికంగా 15. 25 కోట్ల రూపాయలు పలికాడు. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై ఇండియన్స్‌ వేలంలో పోటీ పడి మరీ దక్కించుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢీకొట్టి ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది. కాగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (రూ. 16 కోట్లు), స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (రూ. 8 కోట్లు), వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ (రూ. 6 కోట్లు)ను రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా ఇషాన్‌ను వదులుకోవాల్సి వచ్చింది. అయితే, మెగా వేలంలో మాత్రం వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. హైదరాబాద్‌తో పోటీ పడి రికార్డు ధరకు అతడిని కొనుగోలు చేసింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement