Cricket World Cup: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్.. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ.. క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా.. ఇప్పటికే అహ్మదాబాద్ కు చేరుకున్న టీమిండియా
చరిత్రాత్మకమైన ఈ మ్యాచ్ కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
Newdelhi, Nov 17: గుజరాత్ (Gujarat) లోని అహ్మదాబాద్ (Ahmedabad) లో మోదీ స్టేడియం (Modi Stadium) వేదికగా భారత్-ఆస్ట్రేలియా (Ind Vs Aus) మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరిత్రాత్మకమైన ఈ మ్యాచ్ కు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, ప్రపంచ విజేత టైటిల్ కోసం జరిగే ఈ పోరును వీక్షించేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారట. ఈ మ్యాచ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరవుతారని నివేదికలు చెబుతున్నాయి. మోదీతో పాటూ క్రికెట్ దిగ్గజాలు ఎమ్ఎస్ ధోనీ, కపిల్ దేవ్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరవుతారని తెలుస్తోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)