Ben Stokes: ఒకే ఓవర్లో 34 పరుగులు, వరుసగా ఐదు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో విశ్వరూపం చూపించిన ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, వీడియో వైరల్

ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ గా నియమితుడైన బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో విశ్వరూపం ప్రదర్శించాడు. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో దిగిన స్టోక్స్ ఒకే ఓవర్లో 34 పరుగులు పిండుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్ వేసిన ఓ ఓవర్లో స్టోక్స్ వరుసగా ఐదు సిక్స్ లు, ఫోర్ బాదడం విశేషం.

Ben Stokes Celebrates His Century (Photo Credits: Getty Images)

ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ గా నియమితుడైన బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో విశ్వరూపం ప్రదర్శించాడు. సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో దిగిన స్టోక్స్ ఒకే ఓవర్లో 34 పరుగులు పిండుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్ వేసిన ఓ ఓవర్లో స్టోక్స్ వరుసగా ఐదు సిక్స్ లు, ఫోర్ బాదడం విశేషం. కౌంటీల్లో డుర్హామ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 30 ఏళ్ల స్టోక్స్ కేవలం 64 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. స్టోక్స్ బాదుడుకు ఇంగ్లండ్ జట్టు సహచరులు ముగ్ధులయ్యారు. బెన్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. కాగా, స్టోక్స్ వీరబాదుడుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు పంచుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now