Ravi Shastri: టీమిండియా పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉండాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆకాంక్ష

పరిమిత ఓవర్ల క్రికెట్‍కు కెప్టెన్‍ గా ఎవరు ఉండాలో తన అభిప్రాయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Ravi Shastri (Photo credit: Twitter)

Newdelhi, June 26: టీమిండియా (Team India) తర్వాతి కెప్టెన్ (Captain) ఎవరు అనే విషయం ప్రస్తుతం హాట్‍టాపిక్‍గా ఉంది. ప్రస్తుతం టెస్టులు, వన్డేలు, టీ20లు.. మూడు ఫార్మాట్‍లకు రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‍గా వ్యవహరిస్తున్నాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డేలు, టీ20)కు యువ కెప్టెన్ ఉండాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్‍ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) సంచలన వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‍కు కెప్టెన్‍ గా ఎవరు ఉండాలో తన అభిప్రాయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్‍గా హార్దిక్ పాండ్యా ఉండాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్ ఆడే పరిస్థితుల్లో పాండ్య లేనట్టుగా కనిపిస్తోందని, అందుకే అతడు పూర్తిగా వైట్ బాల్ క్రికెట్‍పైనే దృష్టి సారించాలని సూచించాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)