Rashid Khan Hat-Trick Video: రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వికెట్ వీడియో ఇదిగో, అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు
ఐపీఎల్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జోరుకు బ్రేక్ పడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ ఓటమిపాలైంది.ఈ మ్యాచ్‌లో గుజరాత్ స్టాండింగ్ కెప్టెన్ వ్యవహరించిన రషీద్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు
ఐపీఎల్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జోరుకు బ్రేక్ పడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ ఓటమిపాలైంది.ఈ మ్యాచ్‌లో గుజరాత్ స్టాండింగ్ కెప్టెన్ వ్యవహరించిన రషీద్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది సీజన్‌లో రషీద్ తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను రషీద్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రషీద్ నిలిచాడు.ఇప్పటివరకు టీ20ల్లో నాలుగు సార్లు రషీద్ హ్యాట్రిక్ సాధించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో రషీద్ తర్వాతి స్థానంలో అండ్రూ టై, మహ్మద్ షమీ, అమిత్ మిశ్రా, రస్సెల్, తహీర్ ఉన్నారు. వీరిందరూ ఇప్పటివరకు మూడు సార్లు హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు. కాగా రషీద్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)