Ravindra Jadeja 200th Wicket Video: వీడియో ఇదిగో, షమీమ్ హొస్సేన్ వికెట్ పడగొట్టడం ద్వారా వన్డేల్లో 200 వికెట్ల సాధించిన 14వ ప్లేయర్‌గా రవీంద్ర జడేజా రికార్డు
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే వన్డేల్లో భారత్ తరఫున కపిల్ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే వన్డేల్లో భారత్ తరఫున కపిల్ (3783 పరుగులు, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. భారత్ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్కును అందుకున్న ఏడో బౌలర్‌గా (337 వన్డే వికెట్లతో కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు) రికార్డుల్లోకెక్కాడు. ఆసియా కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 15) జరుగుతున్న మ్యాచ్‌లో షమీమ్ హొస్సేన్ వికెట్ పడగొట్టడం ద్వారా జడ్డూ వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్‌లో 182వ వన్డే ఆడుతున్న జడ్డూ.. 200 వికెట్లతో పాటు 2578 పరుగులు చేశాడు.వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)