Rohit Sharma Century Video: వీడియో ఇదిగో, ఐదు సెంచరీలతో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, ఆప్ఘన్ బౌలర్లను ఊచకోత కోసిన టీమిండియా కెప్టెన్
రోహిత్ శర్మకు అంతర్జాతీయ టీ20లలో ఇది ఐదవ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. దీంతో పాటుగా అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ(1643 పరుగులు) అవతరించాడు
అఫ్గనిస్తాన్ మూడో టీ20 సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఈ మ్యాచ్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో పరుగుల సునామీ సృష్టించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మొత్తంగా 69 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. 2019 తర్వాత పొట్టి ఫార్మాట్లో తన తొలి శతకం నమెదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20లలో రోహిత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. టీ20లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు, అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డు
రోహిత్ శర్మకు అంతర్జాతీయ టీ20లలో ఇది ఐదవ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. దీంతో పాటుగా అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ(1643 పరుగులు) అవతరించాడు. తద్వారా విరాట్ కోహ్లి పేరిట(1570 రన్స్) ఉన్న ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)