Rohit-Sharma (Photo-X)

అఫ్గనిస్తాన్‌ మూడో టీ20 సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్‌ అయిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఈ మ్యాచ్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. సెంచరీ పూర్తి చేసుకున్నా రోహిత్‌ శర్మ పరుగుల దాహం తీరలేదు. 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో పరుగుల సునామీ సృష్టించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మొత్తంగా 69 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. 2019 తర్వాత పొట్టి ఫార్మాట్లో తన తొలి శతకం నమెదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20లలో రోహిత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

టీ20 కెరీర్‌లో తొలిసారిగా గోల్డెన్‌ డక్‌ అయిన విరాట్ కోహ్లీ, రన్ మిషన్ అవుట్‌ కాగానే నిశ్శబ్దంగా మారిపోయిన స్టేడియం

రోహిత్‌ శర్మకు అంతర్జాతీయ టీ20లలో ఇది ఐదవ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్ర సృష్టించాడు. దీంతో పాటుగా అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ(1643 పరుగులు) అవతరించాడు. తద్వారా విరాట్‌ కోహ్లి పేరిట(1570 రన్స్‌) ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టాడు.

అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్లు

రోహిత్‌ శర్మ(ఇండియా)- 5

సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా)- 4

గ్లెన్‌ మాక్స్‌వెల్‌(ఆస్ట్రేలియా)- 4.