Virat Kohli

ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో మూడో మ్యాచ్‌లో భారత స్టార్ స్టార్ విరాట్ కోహ్లీ తన టీ20ఐ కెరీర్‌లో మొట్టమొదటి గోల్డెన్ డక్‌ను నమోదు చేశాడు. ఓవరాల్‌గా టీ20ల్లో కోహ్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు కూడా చేయలేకపోవడం ఇది ఐదోసారి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీకి అతని ఐపిఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత వేదిక అయిన ఎం చిన్నస్వామి స్టేడియంలో గుమికూడిన ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ లభించింది. ఏది ఏమైనప్పటికీ, ఫాస్ట్ బౌలర్ ఫరీద్ అహ్మద్ బౌన్స్‌తో కోహ్లి విఫలమవడంతో అభిమానులు నిరాశ చెందారు.

ప్రపంచ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ, ఇప్పటివరకూ ఏ క్రికెటర్ సాధించని రికార్డు సాధించిన టీమిండియా స్టార్

అఫ్గన్‌ పేసర్‌ ఫరీద్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో.. టీమిండియా ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ నాలుగో బంతికి.. పుల్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లి విఫలమయ్యాడు. ఈ క్రమంలో మిడాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలిసారిగా గోల్డెన్‌ డక్‌ నమోదు చేశాడు కోహ్లి. అది కూడా ఐపీఎల్‌లో తన సొంతమైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో ఈ చెత్త రికార్డు మూటగట్టుకోవడం గమనార్హం.

కోహ్లి బ్యాటింగ్‌ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. విరాట్‌ కోహ్లి అవుట్‌ కాగానే స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది.ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లి ఆరు పరుగులు చేసి ఉంటే, టీ20ల్లో 12,000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచేవాడు ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గన్‌తో జరుగుతున్న సిరీస్‌లో రోహిత్‌ సేన ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.