అంతర్జాతీయ టీ20 పునరాగమనం ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరికొత్త ప్రపంచ రికార్డు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో ఇంత వరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు.ఇంటర్నేషనల్ టీ20 ఛేజింగ్ మ్యాచ్‌లలో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు కోహ్లి. తద్వారా ప్రపంచంలో ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.
ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్ ఛేజింగ్‌లో కోహ్లి 46 ఇన్నింగ్స్ ఆడి 136.96 స్ట్రైక్‌రేటుతో 2012 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 20 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ సెకండ్ బ్యాటింగ్‌లో ఈ రికార్డుల రారాజే అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు ఛేజింగ్‌లో 152 ఇన్నింగ్స్ ఆడి 7794 రన్స్ పూర్తి చేసుకున్నాడు కోహ్లి. ఇందులో 27 సెంచరీలు, నలభై ఫిఫ్టీలు ఉన్నాయి.
అఫ్గనిస్తాన్‌తో రెండో మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. అన్నట్లు ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి.. పేసర్ నవీన్ ఉల్ హక్‌కు వికెట్ సమర్పించుకోవడం గమనార్హం.