టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి క్రేజ్ తెలిపే మరో ఉదాహరణ. ఇండోర్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ అభిమాని కోహ్లిని కలిసేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. సదరు ఫ్యాన్‌ గ్రౌండ్‌ సిబ్బంది కళ్లు కప్పి బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి వద్దకు వచ్చి కాళ్లు మొక్కి, కౌగిలించుకున్నాడు. తొలుత ఆ అభిమాని తనవైపు వస్తున్నప్పుడు కాస్త అసౌకర్యంగా కనిపించిన కోహ్లి ఆ తర్వాత అతన్ని హత్తుకున్నాడు. ఈలోపు సిబ్బంది వచ్చి ఆ అభిమానికి ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన కారణంగా మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)