Rohit Sharma: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు

సచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. రోహిత్‌ (Rohit Sharma) 261 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్-మెషీన్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి 2019లో కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.

Rohit Sharma. (Photo credits: X/@BCCI)

అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సరికొత్త రికార్డు చేశాడు. వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా టీమిండియా కెప్టెన్ రికార్డు నెలకొల్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఈ రికార్డు ఉండేది.

చరిత్ర తిరగారాసిన విరాట్‌ కోహ్లి, అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న మూడో ఆట‌గాడిగా రికార్డు, అజారుద్దీన రికార్డు సమం

సచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. రోహిత్‌ (Rohit Sharma) 261 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్-మెషీన్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి 2019లో కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. టాస్కిన్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి హిట్‌మ్యాన్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.

వ‌న్డేల్లో అత్యంత వేగంగా 11000 ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

1 - విరాట్ కోహ్లి: 222 ఇన్నింగ్స్‌లు

2 - రోహిత్ శర్మ: 261 ఇన్నింగ్స్

3 - సచిన్ టెండూల్కర్: 276 ఇన్నింగ్స్

4 - రికీ పాంటింగ్: 286 ఇన్నింగ్స్‌లు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement