ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన రోహిత్ శర్మ, ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో స్ధానం కైవసం, విరాట్ కోహ్లిని తొలిసారి అధిగమించిన టీమిండియా కెప్టెన్
ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్‌లో రోహిత్ శర్మ ఆరో స్ధానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023లో అదరగొడుతున్న రోహిత్.. ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు.
ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్‌లో రోహిత్ శర్మ ఆరో స్ధానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023లో అదరగొడుతున్న రోహిత్.. ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆఫ్గానిస్తాన్‌పై సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్.. పాకిస్తాన్‌పై కూడా 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ నేపథ్యంలోనే రోహిత్ తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. కాగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని తొలిసారి రోహిత్ అధిగమించాడు. కోహ్లి ప్రస్తుతం 9వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.ఇక నెం1 ర్యాంక్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఉండగా.. రెండో స్ధానంలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ నిలిచాడు. అదే విధంగా ఈ మెగా టోర్నీలో రెండు వరుస సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడు స్ధానాలు ఎగబాకి 3వ స్ధానానికి చేరుకున్నాడు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)