Rohit Sharma Wicket Video: రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, మరోసారి రబడ చేతికే చిక్కిన టీమిండియా కెప్టెన్, టెస్టుల నుంచి రిటైర్‌ అయిపో అంటూ అభిమానులు ట్రోల్

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరోసారి విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈసారి కూడా అతడు ప్రొటిస్‌ పేసర్‌ కగిసో రబడ చేతికే చిక్కడం గమనార్హం.

Rohit-Sharma-Bowled

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరోసారి విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఈసారి కూడా అతడు ప్రొటిస్‌ పేసర్‌ కగిసో రబడ చేతికే చిక్కడం గమనార్హం. మొదటి ఇన్నింగ్స్ లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు కగిసో రబడ అద్భుతమైన బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. బాల్‌ను తప్పుగా అంచనా వేసిన రోహిత్‌.. నండ్రీ బర్గర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

ఇక రెండో ఇన్నింగ్స్ లో రబడ మరోసారి మాయ చేసి అద్భుత బంతితో రోహిత్‌ను బౌల్డ్‌ చేశాడు. దీంతో ఎనిమిది బంతులు ఎదుర్కొన్న భారత జట్టు సారథి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌతాఫ్రికాతో టెస్టుల్లో రోహిత్‌ గణాంకాల(14, 6, 0, 25, 11, 10, 10, 47, 5 , 0)ను ప్రస్తావిస్తూ #Duck అభిమానులు సైతం పేరిట ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘రోహిత్‌ ఇక టెస్టుల నుంచి కూడా రిటైర్‌ అయిపో’’ అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement