ICC World Cup 2023: ప్రపంచకప్ కోసం టీమిండియా కెప్టెన్ పేరు అనౌన్స్ చేయగానే రోహిత్ శర్మ రియాక్షన్ చూశారా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ (Agarkar), రోహిత్ శర్మ (Rohit Sharma) సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు.
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ (World Cup 2023) కోసం టీమిండియా జట్టును బీసీసీఐ (BCCI) మంగళవారం ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ (Agarkar), రోహిత్ శర్మ (Rohit Sharma) సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా తన పేరును అగార్కర్ చదవగానే రోహిత్ ఒక్కసారిగా చేయి పైకెత్తి హే.. అంటూ ఆనందం వ్యక్తం చేశారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మెగా టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఇక టాప్ ఆర్డర్‌లో శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు. బౌలర్ల జాబితాలో శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, షమీ, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా ఆ బృందంలో చోటు కల్పించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)