Mitchell Santner Catch Video: మిచెల్ శాంట్నర్ కళ్లు చెదిరే క్యాచ్ వీడియో ఇదిగో, ముందుకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్న కివీస్ స్టార్ ఆల్‌రౌండర్
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ మరో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శాంట్నర్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు.
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ మరో సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శాంట్నర్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు.ఫ్గాన్ ఇన్నింగ్స్ 14 ఓవర్‌లో ఆఖరి బంతిని లూకీ ఫెర్గూసన్ షార్ట్‌బాల్‌గా సంధించాడు. స్ట్రైక్‌లో ఉన్న హష్మతుల్లా షాహిదీ ఫుల్‌షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే షాట్ కనక్ట్ కాకపోవడంతో బంతి స్క్వేర్ లెగ్ దిశగా గాల్లోలోకి లేచింది. ఈ క్రమంలో మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శాంట్నర్ పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్ క్యాచ్‌ను అందుకున్నాడు.ఇది చూసిన బ్యాటర్‌తో పాటు ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)