Shane Warne No More: స్పిన్ రారాజు షేన్ వార్న్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ఇకలేడన్న వార్త తమను కలచివేసిందని తెలిపిన కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, నితిన్ గడ్కరీ
ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ ఉదయం ఆసీస్ దిగ్గజం రాడ్ మార్ష్ మృతితో విషాదంలో ఉన్న క్రికెట్ వర్గాలను తాజాగా వార్న్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వార్న్ గురించిన వార్తలే కనిపిస్తున్నాయి.

కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ, స్పిన్ రారాజు షేన్ వార్న్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన స్పిన్ తో మైదానంలో మ్యాజిక్ చేసి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడని కొనియాడారు. మరో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్పిన్ దిగ్గజం వార్న్ ఇకలేడన్న వార్త తనను కలచివేసిందని తెలిపారు. ఆయన కుటుంబానికి, బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు గడ్కరీ ట్వీట్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)