India vs Zimbabwe 3rd ODI: వీడియో ఇదే.. కాలా చష్మా పాటకు డ్యాన్సుతో దుమ్మురేపిన టీమిండియా, అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టిన శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ సహా మిగతా ఆటగాళ్లు
'కాలా చష్మా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ముఖ్యంగా ధావన్, మ్యాచ్ హీరో శుబ్‌మన్ గిల్‌లు కాలా చస్మా సిగ్నేచర్ స్టెప్పులతో దుమ్మురేపారు.
జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా సంతోషంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ సహా మిగతా ఆటగాళ్లు బాలీవుడ్ పాపులర్ పాట.. 'కాలా చష్మా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ముఖ్యంగా ధావన్, మ్యాచ్ హీరో శుబ్‌మన్ గిల్‌లు కాలా చస్మా సిగ్నేచర్ స్టెప్పులతో దుమ్మురేపారు. ఈ వీడియోనూ ధావన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్ అయింది. కాలా చస్మా ట్రెండ్ అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసిన ధావన్.. సెలబ్రేషన్ మూడ్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)