Ben Stokes Run Out Video: వీడియో ఇదిగో, శ్రేయాస్ అయ్యర్ డైరెక్ట్ త్రోకు బలైన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, రెండో టెస్టులో భారత్ అద్భుత విజయం
సోమవారం నాటి ఆటలో అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 52.4 ఓవర్ వద్ద అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు.అయితే, నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ బెన్ స్టోక్స్ బద్దకంగా కదిలాడు.
ఉప్పల్ టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా(Team India) వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో అద్భుత విజయం సాధించింది. 106 పరుగులతో రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంది. టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌లో విఫలమైనా తన ఫీల్డింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ జాక్ క్రాలే(76) ఇచ్చి క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు అయ్యర్. శ్రేయాస్ అయ్యర్ వెనుకకు పరిగెత్తుతూ అందుకున్న అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో, భారీ షాట్లతో భారత్ బౌలర్లను హడలెత్తించిన జాక్ క్రాలీని పెవిలియన్‌కు..
తాజాగా సోమవారం నాటి ఆటలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 52.4 ఓవర్ వద్ద అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు.అయితే, నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ బెన్ స్టోక్స్ రన్ కోసం పరుగు పెట్టాడు. అయితే మిడ్ వికెట్ మీదుగా వచ్చిన బంతిని ఒంటిచేత్తో అందుకున్న శ్రేయస్ అయ్యర్.. నేరుగా దానిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికి స్టోక్స్ ఇంకా క్రీజులోకి చేరుకోకపోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)