Gujarat Titans New Captain: గుజరాత్‌ టైటాన్స్‌ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు బదిలీ

2024 ఐపీఎల్‌ సీజన్‌ కోసం గుజరాత్‌ టైటాన్స్‌ తమ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ను ప్రకటించింది. గత రెండు సీజన్లలో గిల్‌ తమ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడని, బ్యాటర్‌గానే కాకుండా అన్ని విషయాల్లో పరిణతి సాధించాడని ఫ్రాంచైజీ డైరెక్టర్‌ విక్రమ్‌ సోలంకీ అన్నాడు.

Shubman Gill (Photo-Twitter/BCCI)

2024 ఐపీఎల్‌ సీజన్‌ కోసం గుజరాత్‌ టైటాన్స్‌ తమ కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ను ప్రకటించింది. గత రెండు సీజన్లలో గిల్‌ తమ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడని, బ్యాటర్‌గానే కాకుండా అన్ని విషయాల్లో పరిణతి సాధించాడని ఫ్రాంచైజీ డైరెక్టర్‌ విక్రమ్‌ సోలంకీ అన్నాడు. గిల్‌ సహకారంతో టైటాన్స్‌ ఐపీఎల్‌లో బలీయమైన శక్తిగా ఎదిగిందని అతను పేర్కొన్నాడు. గిల్‌ లాంటి యువ నాయకుడితో కొత్త ప్రయాణం ప్రారంభించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు.

కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై గిల్‌ స్పందిస్తూ.. టైటాన్స్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాడు. టైటాన్స్‌ సారధ్య బాధ్యతలు లభించినందుకు గర్విస్తున్నాని అన్నాడు. కాగా, నిన్న (నవంబర్‌ 26) చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల్లో ముంబై ఇండియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి హార్దిక్‌ పాండ్యాను ట్రేడిండ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. హార్దిక్‌ నాయకత్వంలో టైటాన్స్‌ 2022 సీజన్‌లో విజేతగా, 2023 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement