Shubman Gill Dismissal Video: జేమ్స్‌ ఆండర్సన్‌ ఇన్‌స్వింగర్‌కు క్లీన్ బౌల్డ్ అయిన శుబ్‌మన్‌ గిల్‌, బిత్తరపోయి అలానే చూస్తుండిపోయిన భారత స్టార్ ఆటగాడు

గిల్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయగా బంతి అద్బుతంగా టర్న్‌ అయ్యి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది.

Shubman Gill Knocked Over By James Anderson After Century On Day 2 Watch Video

భారత-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. బుమ్రా (19), కుల్దీప్‌ (27) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ సంచలన బంతితో మెరిశాడు.

అద్భుతమైన బంతితో భారత బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను ఆండర్సన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. భారత ఇన్నింగ్స్‌ 63 ఓవర్‌ వేసిన ఆండర్సన్‌ రెండో బంతిని గిల్‌కు ఇన్‌స్వింగర్‌గా సంధించాడు.ఆండర్సన్‌ వేసిన బంతికి గిల్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. గిల్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయగా బంతి అద్బుతంగా టర్న్‌ అయ్యి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. 150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు గిల్. గిల్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం విశేషం.  బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌ బాదిన శుబ్‌మన్‌ గిల్‌, బిత్తరపోయిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)