భారత-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌లో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. బుమ్రా (19), కుల్దీప్‌ (27) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా 255 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ అద్బుతమైన షాట్‌తో మెరిశాడు.బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌ బాదాడు. భారత ఇన్నింగ్స్‌ 33 ఓవర్‌ వేసిన జేమ్స్‌ ఆండర్సన్‌ రెండో బంతిని గుడ్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో స్ట్రైక్‌లో ఉన్న గిల్‌ ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి బంతిని చూడకుండానే స్ట్రైట్‌గా భారీ సిక్సర్‌గా మలిచాడు. గిల్‌ షాట్‌కు ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ సైతం ఫిదా అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బెన్ స్టోక్స్ మ్యాజిక్ బంతికి క్లీన్ బౌల్డ్ అయిన రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్ ఎక్స్‌ప్రెషన్స్ వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)