World Cup 2023: దక్షిణాఫ్రికా చేతిలో 190 పరుగుల తేడాతో చిత్తయిన న్యూజీలాండ్, పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను సజీవం చేసిన కివీస్

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పుణే MCA Stadiumలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఓటమి పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ప్రోటీస్‌ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది.

South Africa Team (Photo-Twitter/ICC)

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పుణే MCA Stadiumలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఓటమి పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ప్రోటీస్‌ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్‌ ఘోర ఓటమితో పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కివీస్‌ నాలుగో స్ధానానికి చేరుకోగా.. ఆస్ట్రేలియా మూడో స్ధానానికి ఎగబాకింది. కివీస్‌ ఓటమితో పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలు మరింత రెట్టింపు అయ్యాయి.

ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్‌ 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంకా పాకిస్తాన్‌కు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ జట్లతో పాకిస్తాన్‌ తలపడనుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌ సెమీస్‌ చేరాలంటే.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌పై కచ్చితంగా విజయం సాధించాలి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now