T20 World Cup 2022: గెలిచేది ఎవరు, కివీస్- పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ పోరు, 2007 టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఇద్దరూ తలపడటం ఇదే తొలిసారి
నేటి నుంచే సెమీఫైనల్స్‌కు తెర లేవనుంది. నేడు కివీస్- పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ పోరు జరగనుంది. 2007 టీ20 వరల్డ్‌కప్ తర్వాత మరో ఐసీసీ ఈవెంట్ సెమీస్ లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి.
20 ప్రపంచకప్ చివరి దశకు చేరింది. నేటి నుంచే సెమీఫైనల్స్‌కు తెర లేవనుంది. నేడు కివీస్- పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ పోరు జరగనుంది. 2007 టీ20 వరల్డ్‌కప్ తర్వాత మరో ఐసీసీ ఈవెంట్ సెమీస్ లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది.30 ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌తో తలపడిన మూడుసెమీఫైనల్స్‌లోనూ (1992, 1999 వన్డే వరల్డ్‌కప్.. 2007 టీ20 వరల్డ్‌కప్) పాక్ గెలిచింది.
తుది జట్లు (అంచనా)
పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్, మహ్మద్ నవాజ్, షాదాబ్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షహీన్, రౌఫ్.
న్యూజిలాండ్: ఆలెన్, కాన్వే, విలియమ్సన్ (కెప్టెన్), ఫిలిప్, మిచెల్, నీషమ్, శాంట్నర్, సౌథీ, బౌల్ట్, సోధీ, ఫెర్గూసన్.