T20 World Cup 2022: హ్యట్రిక్ వీడియో, టీ20 ప్రపంచకప్-2022లో మరో హ్యాట్రిక్ నమోదు, న్యూజీలాండ్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఐర్లాండ్ పేసర్ జాషువా లిటిల్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్-2022లో మరో హ్యాట్రిక్ నమోదైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్ పేసర్ జాషువా లిటిల్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన లిటిల్ రెండో బంతికి విలియమ్సన్, మూడో బంతికి నీషమ్, నాలుగో బంతికి శాంట్నర్ పెవిలియన్‌కు పంపాడు.

తద్వారా తన కెరీర్‌లో తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన రెండో ఐరీష్ బౌలర్‌గా లిటిల్ రికార్డులకెక్కాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్ బౌలర్ కుర్టిస్ కాంఫియర్ హాట్రిక్ వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్ చరిత్రలో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన ఆరో బౌలర్‌గా లిటిల్ నిలిచాడు. కాగా ఈ ఏడాది ప్రపంచకప్‌లో శ్రీలంకపై యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయప్పన్ తొలి హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)