Umesh Yadav Bowls Video: వీడియో ఇదే.. నిప్పులు చెరిగే బంతులతో స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్‌ ఉమేష్ యాదవ్, గాల్లో పల్టీలు కొడుతూ నాట్యం చేసిన వికెట్లు, స్వదేశంలో 100 వికెట్ల క్లబ్‌లోకి యాదవ్

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఉమేశ్‌ యాదవ్‌ నిప్పులు చెరిగాడు. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో కీలకంగా వ్యవహరించాడు.

Umesh Yadav (Photo-Twitter/Video Grab)

ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఉమేశ్‌ యాదవ్‌ నిప్పులు చెరిగాడు. స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో కీలకంగా వ్యవహరించాడు.రెండో రోజు తొలి సెషన్‌లో డ్రింక్స్‌ తర్వాత బంతిని అందుకున్న ఉమేశ్‌.. స్పిన్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై నిప్పులు చెరుగుతూ తొలుత గ్రీన్‌ను ఎల్బీడబ్ల్యూగా ఆతర్వాత స్టార్క్‌ను, మర్ఫీలను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాక ఉమేశ్‌ స్వదేశంలో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఉమేశ్‌ మెరుపు వేగంతో సంధించిన బంతుల ధాటికి స్టార్క్‌, మర్ఫీ వికెట్లు గాల్లో పల్టీలు కొడుతూ నాట్యం చేశాయి. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement