Virat Kohli Crying Video: విరాట్ కోహ్లి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇదిగో, ఓటమి తర్వాత తీవ్ర నిరాశకు గురై, ఉబికి వస్తున్న కంట తడిని దాచుకుంటూ..
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది.
వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా చివరి అంకం ఫైనల్ మ్యాచ్ లో బోల్తా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. ఆసీస్ గెలుస్తున్న సమయంలో విరాట్ కోహ్లి కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆసీస్ విజయానికి చేరువులో ఉన్నప్పుడు కోహ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఈ టోర్నీ మొత్తం కోహ్లి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 765 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వగానే స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన బౌలింగ్‌లో మాక్స్‌వెల్ తన బౌలింగ్‌లో విన్నింగ్ షాట్ కొట్టగానే సిరాజ్ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సమయంలో బుమ్రా అతడి దగ్గరకు వెళ్లి ఓదార్చాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)