Kohli Breaks Rohit Sharma Record: రోహిత్ శర్మ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా..

మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు

Virat Kohli (Photo Credits: @CricCrazyJohns/ Twitter)

సౌతాఫ్రికాతో మొదలైన మొదటి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 2101 పరుగులున్నాయి. రోహిత్ శర్మ 42 ఇన్నింగ్స్‌ల్లో 2097 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 57 ఇన్నింగ్స్‌ల్లో 2101 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ పేరు మీద ఉంది. రూట్ 3,987 పరుగులు చేశాడు. 3,641 పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ మూడో స్థానంలో, 3,223 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)