Kohli Touches Shami's Mother's Feet: దటీజ్ విరాట్ కోహ్లీ అంటున్న నెటిజన్లు, మొహమ్మద్ షమీ తల్లి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఇదిగో
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫైనల్ మ్యాచ్ విజయం తర్వాత కోహ్లీ మొహమ్మద్ షమీ తల్లి కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ ముగిశాక భారత జట్టు అంతా విజయోత్సాహంలో ముగిగిపోయారు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒకటి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫైనల్ మ్యాచ్ విజయం తర్వాత కోహ్లీ మొహమ్మద్ షమీ తల్లి కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ ముగిశాక భారత జట్టు అంతా విజయోత్సాహంలో ముగిగిపోయారు. అప్పుడే మైదానంలో సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ తన తల్లితో కలిసి మైదానంలోకి వచ్చారు. విరాట్ కోహ్లీ ఆమె దగ్గరికి వెళ్ళగానే పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు.
ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ఈ హార్ట్ టచింగ్ మూమెంట్ సోషల్ మీడియాలో నెటిజన్లు మనసును గెలుచుకుంది. పెద్దవారికి కోహ్లీ ఇచ్చే గౌరవం చూసి ఫ్యాన్స్ మరోసారి అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 1 పరుగు చేసి ఔటయ్యాడు. బ్రేస్ వెల్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో భారత జట్టు న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి రికార్డుస్థాయిలో మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది.
Kohli Touches Shami's Mother's Feet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)