MS Dhoni Ploughing Farm Video: రైతుగా మారిన ధోనీ, ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న వీడియో వైరల్, పొలం చదును చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టిందని ట్వీట్
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ట్రాక్టర్ తో పొలం చదును చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.రెండేళ్ల తర్వాత ధోనీ పోస్ట్ కనిపించడంతో క్షణాలలోనే అది వైరల్ గా మారింది
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ట్రాక్టర్ తో పొలం చదును చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.రెండేళ్ల తర్వాత ధోనీ పోస్ట్ కనిపించడంతో క్షణాలలోనే అది వైరల్ గా మారింది. కోటి మందికి పైగా ఆ వీడియోను చూడగా.. 28 లక్షల మంది లైక్ చేశారు, 60 వేల మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఈ వీడియోలో ధోనీ పొలం దున్నుతూ, చదును చేస్తూ కనిపించారు. ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా ట్రాక్టర్ పై ఉన్నారు.ఎప్పుడైనా సరే.. ఓ కొత్త విషయం తెలుసుకోవడం, నేర్చుకోవడం సంతోషాన్ని కలిగిస్తుందంటూ ధోనీ తన వీడియోకు క్యాప్షన్ జతచేశారు. అయితే, పొలం చదును చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టిందని ఆయన వివరించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)