PSL 2023: వీడియో ఇదిగో.. షాహిన్ అఫ్రిది సంధించిన వేగానికి విరిగిన బ్యాట్, రెండో బంతికి స్టంప్ గాల్లోకి, సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్‌లో ఖలందర్ తరపున ఆడుతున్న షాహీన్ అఫ్రిది నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పెషావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్‌లో ఖలందర్ తరపున ఆడుతున్న షాహీన్ అఫ్రిది నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పెషావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. తొలి బంతికి మహ్మద్ హరీస్ బ్యాట్ రెండు ముక్కలైంది. అనంతరం మరో బ్యాట్‌తో బ్యాటింగ్ కొనసాగించిన హరీస్‌ను షాహీన్ రెండో బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు. షాహీన్ సంధించిన వేగం ధాటికి ఆఫ్ స్టంప్ గాల్లోకి పల్టీలు కొడుతూ నాట్యం చేసింది. చూడముచ్చటైన ఈ తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మ్యాచ్ లో 0 పరుగుల తేడాతో పెషావర్ ఓటమి పాలైంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)