David Warner: డేవిడ్ వార్నర్‌ వీడియోపై భార్య కాండీస్‌ సెటైర్, ఇలాంటి పనులు మన ఇంటిలో కూడా చేయవచ్చు కదా అని ట్వీట్, వైరల్ అవుతున్న వార్నర్ వీడియో

వార్నర్‌ వీడియోపై అతని భార్య కాండీస్‌ స్పందించింది. '' ఇలాంటి పనిని మన ఇంటి పరిసరాల్లో కాస్త ఎక్కువగా చేస్తావని ఆశిస్తున్నా'' అంటూ ఫన్నీగా ట్వీట్‌ చేశారు.

David Warner (photo-Video grab)

పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ ఓటమి ఖాయమనుకున్న దశలో కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ అసాధారణ పోరాటానికి తోడు.. మహ్మద్‌ రిజ్వాన్‌ మెరుపు సెంచరీ.. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ 96 పరుగులతో రాణించడంతో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ లో బౌలర్‌కు సుగమమైన ల్యాండింగ్‌ కోసం ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సుత్తితో మట్టిని తొలిగించిన సంగతి తెలిసిందే. కాసేపు గ్రౌండ్‌మెన్‌ అవతారం ఎత్తిన కమిన్స్‌ పనిని క్రికెట్‌ ఫ్యాన్స్‌ సరదాగా ట్రోల్‌ చేశారు.

తాజాగా వార్నర్‌ కూడా ఐదో రోజు ఆటలో పాకిస్తాన్‌ స్కోరు 4 వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద ఉన్నప్పుడు సుత్తిని తీసుకొచ్చాడు. పిచ్‌పై ఉన్న ఫుట్‌మార్క్స్‌ను తొలగించే పనిలో మట్టిని సరిచేశాడు. ఇదంతా అక్కడి కెమెరాల్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియోనూ పీసీబీ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. తాజాగా వార్నర్‌ వీడియోపై అతని భార్య కాండీస్‌ స్పందించింది. '' ఇలాంటి పనిని మన ఇంటి పరిసరాల్లో కాస్త ఎక్కువగా చేస్తావని ఆశిస్తున్నా'' అంటూ ఫన్నీగా ట్వీట్‌ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement