Michael Bracewell's Hat-Trick Video: వీడియో ఇదిగో.. కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్
తన కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా బ్రేస్‌వెల్ రికార్డు సృష్టించాడు.
టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా బ్రేస్‌వెల్ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన బ్రేస్‌వెల్ ఈ ఘనత సాధించాడు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన బ్రేస్‌వెల్.. మూడు, నాలుగు, ఐదు బంతుల్లో వరుస వికెట్లు తీసి తొలి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
తన టీ20 కెరీర్‌లో ఇదే అతడికి తొలి ఓవర్. మూడో బంతికి మార్క్ అడైర్ బౌండరీ వద్ద క్యాచ్ రూపంలో వెనుదిరిగగా.. నాలుగో బంతికి మెక్ గ్రాతీ, ఐదో బంతికి క్రెగ్ యంగ్ పెవిలియన్‌కు చేరారు. ఈ మ్యాచ్‌లో కేవలం 5 బంతులే వేసిన అతడు ఐదు పరుగులతో పాటు మూడు వికెట్లు సాధించాడు. జూలై 18న ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రేస్‌వెల్‌కు ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అదే విధంగా అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో న్యూజిలాండ్ బౌలర్‌గా బ్రేస్‌వెల్ నిలిచాడు. అంతకుమందు జాకబ్ ఓరమ్,టిమ్ సౌథీ ఈ ఘనత సాధించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)