WPL 2023 Schedule: మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ఇదే, గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య తొలి మ్యాచ్, మార్చి 4 నుంచి 26 వరకు సమరం

ముంబై వేదికగా మార్చి 4 నుంచి 26 వరకు ఈ లీగ్‌ జరనుంది. ఐదు జట్లు బరిలో నిలిచిన తొలి ఎడిషన్‌లో మొత్తం 22 మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో 20 లీగ్‌ మ్యాచ్‌లు, రెండు నాకౌట్‌ మ్యాచ్‌లు (ఎలిమినేటర్‌, ఫైనల్‌) ఉన్నాయి.

WPL 2023 Schedule

బీసీసీఐ..మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌) షెడ్యూల్‌ విడుదల చేసింది. ముంబై వేదికగా మార్చి 4 నుంచి 26 వరకు ఈ లీగ్‌ జరనుంది. ఐదు జట్లు బరిలో నిలిచిన తొలి ఎడిషన్‌లో మొత్తం 22 మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో 20 లీగ్‌ మ్యాచ్‌లు, రెండు నాకౌట్‌ మ్యాచ్‌లు (ఎలిమినేటర్‌, ఫైనల్‌) ఉన్నాయి. ముంబైలోని డీవై పాటిల్‌, సీసీఐ బ్రబౌర్న్‌ స్టేడియాలు చెరో 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. మార్చి 4న (శనివారం) గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య డీవై పాటిల్‌ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ తో డబ్ల్యూపీఎల్ కు తెరలేవనుంది. తర్వాతి రోజు (ఆదివారం) తొలి డబుల్ హెడర్ (ఒక రోజు రెండు మ్యాచ్ లు) ఆర్‌సీబీ–ఢిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్స్‌–గుజరాత్‌ జెయింట్స్‌ తలపడతాయి.

ఈ సీజన్‌లో మొత్తం నాలుగు డబుల్‌ హెడర్స్‌ ఉన్నాయి. అందులో తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30కి మొదలవుతుంది. రాత్రి మ్యాచ్‌లు 7.30 నుంచి జరుగుతాయి. లీగ్ దశలో చివరి పోరు మార్చి 21న బ్రబౌర్న్‌లో యూపీ, ఢిల్లీ మధ్య జరుగుతుంది. లీగ్‌ స్టేజ్‌లో ఒక్కో జట్టు మిగతా నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్ దశలో అగ్రస్థానం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరుతుంది. 2,3వ స్థానాల్లో నిలిచిన జట్లు మార్చి 24న డీవై పాటిల్‌ స్టేడియంలో ఎలిమినేటర్‌లో పోటీ పడతాయి. ఇందులో గెలిచిన జట్టుతో లీగ్ దశ టాపర్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంది. ఫైనల్ మ్యాచ్ ను మార్చి 26న బ్రబౌర్న్‌ స్టేడియంలో షెడ్యూల్ చేశారు.

Here's List

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)