PM Modi on Mbappe: నీకు ఇండియాలో మస్తు క్రేజ్ ఉంది సామే, ఫ్రాన్స్ ఫుట్‌బాల్‌ స్టార్‌ ఎంబాపేని పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోదీ

ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌గా ఉన్న కైలియన్‌ ఎంబాపెను ఇక్కడ ఎంత ఆరాధిస్తారో.. భారత్‌లో కూడా అతని పేరు మార్మోగిపోతుంది. ఎంబాపెకు ఫ్రాన్స్‌లో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ భారత్‌లో మాత్రం అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు.

PM Modi and Kylian Mbappe (photo-ANI,FB)

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రధాని మోదీ నోటి వెంట ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌.. జట్టు కెప్టెన్‌ కైలియన్‌ ఎంబాపే పేరు రావడం ఆసక్తి కలిగించింది.పారిస్‌లోని లా సినేలో భారతీయ సంఘంతో సమావేశమయ్యారు. భారతీయ సంఘానికి తన సందేశాన్ని వినిపిస్తూ ఎంబాపె గురించి ప్రస్తావించారు. విదేశీ ఆటగాళ్లపై భారత్‌లో రోజురోజుకు అభిమానం పెరుగుతుందని పేర్కొన్నారు.

ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌గా ఉన్న కైలియన్‌ ఎంబాపెను ఇక్కడ ఎంత ఆరాధిస్తారో.. భారత్‌లో కూడా అతని పేరు మార్మోగిపోతుంది. ఎంబాపెకు ఫ్రాన్స్‌లో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ భారత్‌లో మాత్రం అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. మా దేశంలో ఎంబాపెకు మస్తు క్రేజ్‌ ఉంది. అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. 2018లో ఫ్రాన్స్‌ ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలవడంలో ఎంబాపె కీలకపాత్ర పోషించాడు.

PM Modi and Kylian Mbappe (photo-ANI,FB)

ANI Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement