FIFA World Cup 2022: హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతు, జాతీయ గీతం పాడటానికి నిరాకరించిన ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్ళు
స్వదేశంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా నవంబర్ 21, సోమవారం నాడు FIFA వరల్డ్ కప్ 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన గ్రూప్ B మ్యాచ్‌లో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్ళు జాతీయ గీతాన్ని పాడటానికి నిరాకరించారు.
స్వదేశంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా నవంబర్ 21, సోమవారం నాడు FIFA వరల్డ్ కప్ 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన గ్రూప్ B మ్యాచ్‌లో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్ళు జాతీయ గీతాన్ని పాడటానికి నిరాకరించారు. ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు ఇరాన్ జట్టులోని మొత్తం 11 మంది ఆటగాళ్లు నిశ్శబ్దంగా నిలబడి ఉన్న వీడియో వైరల్ అయింది.
మహ్సా అమినీ అనే యువతి పోలీసుల కస్టడీలో మరణించిన తర్వాత ఇరాన్ దేశవ్యాప్తంగా చాలా నిరసనలను చూస్తోంది. ఈ నిరసనల్లో పలువురిని ఇరాన్ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇంతకుముందు, ఇరాన్ పురుషుల పోలో జట్టు కూడా ఆసియా వాటర్ పోలో ఛాంపియన్‌షిప్స్ 2022లో జాతీయ గీతం పాడేందుకు నిరాకరించింది.