FIFA World Cup 2022: షాకింగ్ వీడియో, ఫ్రాన్స్ చేతిలో మొరాకో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆ దేశ అభిమానులు, బ్రస్సెల్స్‌లో విధ్వంసం సృష్టించిన 100 మంది ఫ్యాన్స్
ఫిఫా ప్రపంచకప్-2022లో ఖతర్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్..మొరాకోను చిత్తు చేసి వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరుకుంది. నాకౌట్ దశలో అదరగొట్టిన మొరాకో.. కీలకమైన సెమీఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. 0-2 తేడాతో ఓటమిపాలైన మొరాకో ఈ మెగా ఈవెంట్ నుంచి ఇంటిముఖం పట్టింది. మొరాకో ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలో మొరాకో అభిమానులు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో విధ్వంసం సృష్టించారు. సుమారు 100 మంది ఫ్యాన్స్ బ్రస్సెల్స్ సౌత్ స్టేషన్ సమీపంలో పోలీసులపై బాణాసంచాలను విసిరారు. అదే విధంగా వీధుల్లో ఉన్న షాప్‌లకు నిప్పు అంటించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ అల్లర్లకు కారణమైన చాలా మంది అభిమానలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, భారీ నష్టం ఏమీ జరగలేదని రాయిటర్స్ పేర్కొంది.
Here's Video's