FIFA World Cup 2022: బైనాక్యులర్స్‌లో బీర్‌ను తీసుకువెళ్లిన అభిమాని,షాకయిన సెక్యూరిటీ సిబ్బంది, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్టేడియాల వద్ద మద్యం అమ్మడం నిషేధంలో ఉంది.అయితే టెన్షన్ తట్టుకోలేని కొందరు అభిమానులు స్టేడియంకు మద్యాన్ని తీసుకువెళ్తున్నారు.
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్టేడియాల వద్ద మద్యం అమ్మడం నిషేధంలో ఉంది.అయితే టెన్షన్ తట్టుకోలేని కొందరు అభిమానులు స్టేడియంకు మద్యాన్ని తీసుకువెళ్తున్నారు. సెక్యూర్టీ గార్డు చెకింగ్ చేస్తున్న సమయంలో వాళ్లు దొరికిపోతున్నారు. తాజాగా ఓ అభిమాని తన బైనాక్యులర్స్‌లో బీర్‌ను తీసుకువెళ్లాడు. చెకింగ్ సమయంలో సెక్యూర్టీ గార్డ్ ఆ బైనాక్యులర్స్ లెన్స్ తీశాడు. అయితే ఆ బైనాక్యులర్‌లో ద్రవం ఉన్నట్లు అతను గుర్తించాడు. శానిటైర్ తీసుకెళ్తున్నట్లు ఫుట్‌బాల్ ఫ్యాన్ చెప్పినా.. దాంట్లో ఉంది ఆల్కహాల్ అని పసికట్టేశారు. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)