Neeraj Chopra Wins Diamond League Title: డైమెండ్ లీగ్ టైటిల్ గెలిచిన నీరజ్ చోప్రా, తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన జావెలిన్ త్రోయర్
తొలి త్రోను ఫౌల్‌గా ప్రారంభించినా.. ఆ తర్వాత 88.44 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి డైమెండ్ లీగ్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు.
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమెండ్ లీగ్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు. తొలి త్రోను ఫౌల్‌గా ప్రారంభించినా.. ఆ తర్వాత 88.44 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి డైమెండ్ లీగ్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత ప్రయత్నాల్లో జావెలిన్‌ను 88.00 మీ, 86.11మీ, 87.00మీ, 83.60 మీటర్ల దూరం విసిరాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకడ్ 86.94 మీటర్ల దూరం విసిరి రెండవ స్థానంలో నిలిచాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఈ ఇండియన్, వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్, డైమండ్ లీగ్‌లోనూ చాంపియన్‌గా నిలిచాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)