Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం
హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు.
Newdelhi, Aug 28: ఒలింపిక్స్ లో (olympics) భారత్ కు బంగారు పతకం (Gold Medal) అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా (Neeraj Chopra) మరో చరిత్ర సృష్టించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్స్ లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. క్వాలిఫైయర్స్‌లో నీరజ్ ఈటెను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌లో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఫైనల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో మారు జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు. ఆ తరువాత వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)