Tokyo Olympic Games 2020: టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత రెజ్లర్లు, 57 కిలోల విభాగంలో రవి కుమార్‌, 86 కిలోల విభాగంలో రెజ్లర్‌ దీపక్‌ పునియా విజయం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 86 కిలోల విభాగంలో రెజ్లర్‌ దీపక్‌ పునియా సెమీస్‌ చేరగా.. తాజాగా రెజ్లింగ్‌ పురుషుల 57 కిలోల విభాగంలో రవి కుమార్‌ సైతం సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాడు.

Wrestlers Ravi Dahiya, Deepak Punia (Photo-Twitter)

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 86 కిలోల విభాగంలో రెజ్లర్‌ దీపక్‌ పునియా సెమీస్‌ చేరగా.. తాజాగా రెజ్లింగ్‌ పురుషుల 57 కిలోల విభాగంలో రవి కుమార్‌ సైతం సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్‌ ఫైనల్‌లో బల్గేరియాకు చెందిన వాలెంటినో వాగేలోవ్‌ను 14-4 తేడాతో ఓడించి రవి సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఒలింపిక్స్‌ ఆడిన తొలిసారే సెమీ ఫైనల్‌ చేరిన ఆటగాడిగా రవి ప్రత్యేకత చాటుకున్నాడు.రెజ్లింగ్‌ పురుషుల 86 కిలోల విభాగం క్వార్టర్‌ ఫైనల్‌లో ప్రత్యర్థి రెజ్లర్‌ జూషన్‌ను 6-3 తేడాతో ఓడించి భారత రెజ్లర్‌ దీపక్‌ పునియా సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. సెమీస్‌లో అతడు అమెరికాకు చెందిన డేవిడ్‌ మోరిస్‌తో తలపడనున్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement