Omicron in AP: ఏపీలో ఒక్కసారిగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు, ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు నమోదు, రాష్ట్రంలో 16కు చేరుకున్న కొత్త వేరియంట్ సంఖ్య

ఏపీలో ఒక్కసారిగా ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 16కు చేరుకుంది.

omicron

ఏపీలో ఒక్కసారిగా ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. తాజాగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 16కు చేరుకుంది. కువైట్, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్ ఉన్నట్లు నిర్థారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు రాగా, అనంతపురం జిల్లాలో రెండు, కర్నూలు జిల్లాలో రెండు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైందని అధికారులు తెలిపారు. బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement